నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి రెండో డోస్ మాత్రమే ఇస్తున్నారు. ముందస్తు రిజిష్ట్రేషన్తో పని లేకుండా కేంద్రాల వద్దకు వచ్చి మొదటి డోస్ వివరాలు చూపిస్తే రెండో డోస్ వేసి పంపిస్తున్నారని తెలిపారు.
కొనసాగుతున్న కరోనా టీకా రెండో డోస్ పంపిణీ - నిజామాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్
నిజామాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నేటి నుంచి తొలిడోస్ నిలిపివేసి.. రెండో డోస్ వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. జిల్లాలో16వేల కొవిషీల్డ్, 890 కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిజామాబాద్లో కరోనా వ్యాక్సినేషన్, కరోనా టీకా
జిల్లాలో 16వేల కొవిషీల్డ్, 890 కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9గంటల నుంచే టీకా కేంద్రాలకు ప్రజలు వచ్చి టీకాలు వేయించుకున్నారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులతోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీకాలు ఇస్తున్నారు.
- ఇదీ చదవండి :ఆవిష్కరణలతో ఒడిశా ఐన్స్టీన్ ప్రపంచ రికార్డులు