RTC Special Offers on Independence day: నిజామాబాద్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పర్యటించారు. స్థానిక బస్టాండ్‌ను సందర్శించి ఆర్టీసీ అందిస్తున్న సేవల వివరాలు ప్రయాణికులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిజామాబాద్ డిపో-1కు వెళ్లిన సజ్జనార్ అక్కడ మొక్క నాటి... కార్మికులతో మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రేపు టీఎస్ఆర్టీసీ పలు రాయితీలు అందిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు.
RTC Special Offers స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్స్ - ఆర్టీసీ స్పెషల్ ఆఫర్స్
RTC Special Offers on Independence day ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిజామాబాద్‌లో పర్యటించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రేపు టీఎస్ఆర్టీసీ పలు రాయితీలు అందిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నారని... మరింత ఆదరించాలని కోరారు.
75 ఏళ్లు దాటిన వారికి రేపు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. అలాగే రేపు పుట్టబోయే పిల్లలకు 12ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఒక కేజీ లోపు కార్గో పార్శిళ్లకు ఉచిత రవాణా సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. వజ్రోత్సావాల సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సజ్జనార్ చెప్పారు. ఈ సందర్భంగా ముగ్గురు స్వతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నారని.. మరింత ఆదరణ అందించాలని కోరారు.
ఇవీ చదవండి: