తెలంగాణ

telangana

ETV Bharat / city

'నగారాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి' - review meeting in nizamabad

పట్టణ ప్రగతి కార్యక్రమంపై నిజామాబాద్ మేయర్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు, కార్పొరేటర్లకు అవగాహన కల్పించారు. నగరాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ అన్నారు.

review meeting on pattanapragathi in nizamabad
'నగారాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి'

By

Published : Feb 22, 2020, 7:08 PM IST

పట్టణ ప్రగతిపై అధికారులు, కార్పొరేటర్లతో నిజామాబాద్ మేయర్​ నీతూ కిరణ్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరాభివృద్ధి కోసం 15మందితో వార్డు కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ కోరారు. ప్రతి డివిజన్​లో సమస్యలపై కార్పొరేటర్లకు అవగాహన ఉండాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్​ వీ పటేల్​ పాల్గొన్నారు.

'నగారాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి'

ఇదీ చదవండిఃఅవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details