తహసీల్దార్లకు రెవెన్యూ రికార్డులు అప్పగించిన వీఆర్వోలు - నిజామాబాద్లో రెవెన్యూ రికార్డుల అప్పగింత
నిజామాబాద్ జిల్లాలోని వీఆర్వోలు తమ దగ్గరున్న అన్ని రకాల రెవెన్యూ దస్త్రాలు తహసీల్దార్లకు అప్పగించారు. రికార్డులను పరిశీలించి కార్యాలయాల్లో భద్రపరిచారు.
తహసీల్దార్లకు రెవెన్యూ రికార్డులు అప్పగించిన వీఆర్వోలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని వీఆర్వోల నుంచి తహసీల్దార్లు రెవెన్యూ దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అన్ని రికార్డులను మూటలు కట్టి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు అప్పజెప్పారు. రికార్డులను సిబ్బంది పరిశీలించి... పూర్తి వివరాలతో క్రమ సంఖ్య ప్రకారం రిజిస్టర్ చేసి కార్యాలయంలో భద్రపరిచారు.