నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. అద్దె బస్సులను పూర్తిస్థాయిలో నడపాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పూర్తిస్థాయిలో అద్దె బస్సులు నడపడం లేదని, ఆర్టీసీకి సంబంధించినవి మాత్రమే నడపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
'అద్దె బస్సులు నడపాలి.. బకాయిలు చెల్లించాలి' - rental bus owners protest in Nizamabad
అద్దె బస్సులను పూర్తిస్థాయిలో నడపాలని కోరుతూ.. నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద అద్దె బస్సుల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్లో అద్దె బస్సుల యజమానుల నిరసన
అధికారులకు తమ గోడు విన్నవించినా.. ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ బకాయిలు చెల్లించాలని, అద్దె బస్సులు నడిచేలా చూడాలని కోరారు.