తెలంగాణ

telangana

ETV Bharat / city

నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్​కు సర్వం సిద్ధం - నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తాజావార్తలు

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలను పెంచినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజా ప్రతిప్రతినిధులు, పార్టీల నేతలు సహకరించాలని కోరారు.

Polling arrangements for Nizamabad MLC seat are complete Said by Collector Narayana reddy
నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్​కు సర్వం సిద్ధం

By

Published : Oct 6, 2020, 7:33 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 9వ తేదీన ఎన్నిక జరగనుందని వెల్లడించారు. అక్టోబర్ 8వ తేదీన సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో 28 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ జిల్లాలో, మరో 22 కామారెడ్డిలో ఉన్నాయని తెలిపారు. 48 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్​ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మిగతా రెండు పోలింగ్ కేంద్రాలను వీడియో కెమెరా ద్వారా కవర్ చేయడం జరుగుతుందన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ మాస్కు, గ్లౌజులు ధరించాలని సూచించారు. 12వ తేదీ కౌంటింగ్​కు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, ఆర్డీవోలు, పోలీసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details