నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నేరాలకు పోలీసులు నివ్వెర పోయారు. ఒక కేసులో నిందితుడిని అరెస్ట్ చేయగా.. అతడు మరో రెండు హత్యలు చేసినట్లు నిర్ధరించారు. కేవలం 500, 1000 రూపాయలకు హత్యలకు పాల్పడినట్లు చెప్పడంతో కంగుతిన్నారు.
మరో మూడు హత్యలు చేసినట్లు అంగీకారం..
డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ శివారులోని వైకుంఠధామం పక్కన.. ఈ నెల 5న ఓ మహిళ హత్యకు గురైంది. మిట్టాపల్లికి చెందిన నర్సమ్మగా గుర్తించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమలాపూర్‌కు చెందిన మహమ్మద్ షారూఖ్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. వృద్ధురాలిని చంపినట్లు ఒప్పుకున్న నిందితుడు... మరో 3 హత్యలు చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు.