నిజామాబాద్లో బీడీ యాజమాన్యం, కార్మిక సంఘాలకు మధ్య వేతనం పెంపుపై చర్చలు జరిగనట్లు ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు. పెంచిన కూలీలు నవంబర్ ఒకటో తేదీ నుంచి చెల్లిస్తారని అన్నారు.
బీడీ యాజమాన్యంతో కార్మికుల చర్చలు సఫలం - telangana latest news
బీడీ యాజమాన్యంతో కార్మికుల కూలీ పెంపు చర్చలు శుక్రవారం జరిగాయని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. పెంచిన కూలీలు నవంబర్ నుంచి చెల్లిస్తారని అన్నారు. లాక్డౌన్ కాలానికి ఆరువేల జీతం ఇవ్వనున్నట్లు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.
బీడీ యాజమాన్యంతో కార్మికుల చర్చలు సఫలం
ప్యాకింగ్ కార్మికులకు రూ.2,160, నెలసరి ఉద్యోగులకు రూ.1,200, బీడీలు చేసేవారికి రూ.1000, బీడీలకు రూ.2 పెరిగినట్లు తెలిపారు. లాక్డౌన్ సమయలోని జీతం ఆరువేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందన్నారు. దీంతో ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు బి.మల్లేష్ పాల్గొన్నారు.