నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. పార్టీలకతీతంగా.. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా ప్రజలకు సేవ చేసి... ఆదర్శ జిల్లాలకు కేసీఆర్ ప్రకటించిన 10కోట్ల నగదు బహుమతిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు, పార్టీలు ఎన్నికల వరకేనని.. ఎన్నికల తర్వాత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చే 10కోట్లు కొట్టేస్తా: జడ్పీ ఛైర్మన్ - dadannagari vital rao
నిజామాబాద్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దడమే కాకుండా... ఆదర్శ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రకటించిన 10కోట్లు సాధించేందుకు కృషి చేస్తానంటున్న నూతన ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి....

ముఖ్యమంత్రి ఇచ్చే 10కోట్లు కొట్టేస్తా: జడ్పీ ఛైర్మన్
ముఖ్యమంత్రి ఇచ్చే 10కోట్లు కొట్టేస్తా: జడ్పీ ఛైర్మన్
ఇదీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం