తెలంగాణ

telangana

ETV Bharat / city

డిసెంబర్‌ 12న జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి - lok adalath latest news

డిసెంబర్‌ 12 రెండవ శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా, ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్‌ సాయి రమాదేవి తెలిపారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవా భవనంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

nizamabad judge sai ramadevi told that lok adalath to be conducted on december 12
డిసెంబర్‌ 12న జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి

By

Published : Dec 4, 2020, 5:43 PM IST

సుప్రీం కోర్ట్, హైకోర్టు ఆదేశాలను అనుసరించి జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్‌ 12న నిర్వహిస్తున్నామని నిజామాబాద్ జిల్లా, ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్‌ సాయి రమాదేవి పేర్కొన్నారు. గుర్తించిన కేసులకు సంబంధించిన కక్షిదారులు హాజరై.. వారి కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

కరోనా నేపథ్యంలో కక్షిదారులు కేసుల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో చాలా కేసులు పరిష్కారం కాకుండా పోయాయన్నారు. ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఆయా కేసులకు సంబంధించిన ఇరువర్గాల కక్షిదారులకు సూచించారు.

లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, ఆక్సిడెంట్, సివిల్, కుటుంబ తగాదాలు తదితర 2,168 కేసులను గుర్తించామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈ నెల 12న కేసులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇదీ చూడండి: ఆల్వాల్ డివిజన్​లో తెరాస శ్రేణుల సంబురాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details