తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉపసంహరణ ఉండదు... బరిలోనే ఉంటాం - అన్నదాతలు

నిజామాబాద్​ లోక్​సభ బరిలో ఉండాలని పసుపు, ఎర్రజొన్న, చెరకు రైతులు నిర్ణయించుకున్నారు. బుధవారం ఉపసంహరణ కోసం ఎవరూ రాలేదు.

14 నామినేషన్లు తిరస్కరణ

By

Published : Mar 28, 2019, 6:09 AM IST

14 నామినేషన్లు తిరస్కరణ
పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్​తో... నిజామాబాద్​ రైతులు లోక్​సభకు నామినేషన్​ వేశారు. నామపత్రాల ఉపసంహరణకు బుధ, గురువారాలు గడువు ఉండగా... మొదటి రోజు ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు రైతు సంఘాలు తెలపడం వల్ల బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు.

మిగతా వారంతా రైతులే...

నిజామాబాద్​ లోక్​సభ స్థానంలో నామినేషన్ల పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో తెరాస, భాజపా, కాంగ్రెస్, పిరమిడ్​, బహుజన ముక్తి, సమాజ్​వాదీ ఫార్వర్డ్​ బ్లాక్​తో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుండగా... మిగతా వారంతా రైతులే.

14 నామినేషన్లు తిరస్కరణ

మొత్తం 14 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అఫిడవిట్,​ వివరాలు సరిగా నింపని కారణంగా వీటిని తిరస్కరించినట్లు రిటర్నింగ్​ అధికారి తెలిపారు.

ఇవీ చూడండి:రైతుల కోసం పోరాడుతుంటే తమపైనే అసత్య ప్రచారమా ?

ABOUT THE AUTHOR

...view details