ఇది సర్కారీ ఊయల.. అనాథల కోవెల..! - Nizamabad district Women and Child Welfare arranged a cradle
ఏ కారణంతోనైనా అప్పుడే పుట్టిన శిశువుల్ని చెత్తకుప్పల్లో పడవేయడం చూసి చలించిన నిజామాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. పసిగుడ్డుల్ని చంపొద్దని.. వద్దనుకున్న వారు తమ పిల్లల్ని ఈ ఊయలలో పడవేయండంటూ జిల్లా ఆస్పత్రి వద్ద సర్కారీ వారి ఊయలను ఏర్పాటు చేశారు.
![ఇది సర్కారీ ఊయల.. అనాథల కోవెల..! radle-for-infants-whose-parents-try-to-throw-them](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10235194-252-10235194-1610592656468.jpg)
పుట్టిన పసిపిల్లలను పోషించే స్తోమత కరవవడం, ఇతర కారణాలతో కొందరు పేదలు శిశువులను మురుగు కాల్వల్లో, చెత్తకుప్పల్లో పడేసి వెళ్తున్నారు. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న నిజామాబాద్‌కు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనాథ శిశువులను ఆదుకోవడానికి వినూత్నంగా ఆలోచించారు. అలాంటి శిశువులను అక్కున చేర్చుకుని వారి బాగోగులను చూసుకోవడానికి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ‘సర్కారీ వారి ఊయల’ను ఏర్పాటు చేశారు. ‘పుట్టిన పసిగుడ్డుల్ని చంపకండి.. ఈ ఊయలలో వేసి జీవం పోయండి’ అని సూచిస్తున్నారు.
- ఇదీ చూడండి :సంస్కృతి సంతకం... సంక్రాంతి!