బొర్గం, ధర్మారం(బి) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బొర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. అక్కడ ఏర్పాటు చేసిన వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్, షెడ్, తాడిపత్రి, వెయింగ్ మిషన్, రిజిస్టర్‌ను పరిశీలించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి:
ధాన్యం 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, జిల్లాలోని 247 రైస్ మిల్లర్లకు కేటాయిస్తుందన్నారు. భారత ఆహార సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. తేమ 17 శాతంలోపు, తాలు ఒక శాతంలోపు ఉండాలని సూచించారు. అట్టి సన్న రకం ధాన్యాన్ని ఏ గ్రేడ్‌గా పరిగణించి క్వింటాలుకు రూ.1,888, సాధారణ రకం ఐతే 1,868 రూపాయలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. జిల్లాలోని రైతు సోదరులందరూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, రైతు మిల్లర్లకు తరుగు తీసుకునే అవకాశం ఇవ్వకూడదని సూచించారు. తరుగు, కడ్త పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేసే రైస్ మిల్లర్లను సీజ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.