తెలంగాణ

telangana

ETV Bharat / city

మెరుగైన సౌకర్యాలకు సర్వసభ్య సమావేశంలో ఆమోదం - నిజామాబాద్ తాజా వార్తలు

నిజామాబాద్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నగర మేయర్ అధ్యక్షతన జరిగింది. పారిశుద్ధ్య నిర్వహణ నిమిత్తం ఆటోలు, ట్రాక్టర్ల కొనుగోలుకు.. డ్రైవర్లు, కార్మికులను పొరుగు సేవల ద్వారా నియమించేందకు ఆమోదం తెలిపారు.

Nizamabad Corporation Council Plenary Session conducted by the City Mayor
మెరుగైన సౌకర్యాలకు సర్వసభ్య సమావేశంలో ఆమోదం

By

Published : Jan 8, 2021, 12:56 PM IST

నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్​లో మేయర్ అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరణకు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులను పొరుగు సేవల ద్వారా నియమించడానికి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఆటోలు, ట్రాక్టర్లను సుమారు 3కోట్ల నిధులతో కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపారు.

పట్టణ ప్రగతి నిధులతో నగరంలో చెత్త నిర్ములన కోసం.. చెత్త వేరుచేసే యంత్ర కొనుగోలుకు ఆమోదం తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతను టౌన్ లెవెల్ ఫెడరేషన్ వారికి అప్పగించారు. ఈ సమావేశానికి శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ వి.జి. గౌడ్, డి. రాజేశ్వర్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ జితేశ్.వి.పాటిల్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మోకీలలో దోపిడీ దొంగల బీభత్సం

ABOUT THE AUTHOR

...view details