ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారాన్ని రాజకీయ పార్టీలన్నీ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. అక్టోబర్ 9న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో పాలనాధికారి సమావేశమయ్యారు. ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, నిన్నటి నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రచారం చేసే క్రమంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు.
'కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఎన్నికల ప్రచారం చేసుకోవాలి' - nizamabad mlc elections updates
అక్టోబర్ 9న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలని సూచించారు. 100 మందికి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
!['కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఎన్నికల ప్రచారం చేసుకోవాలి' nizamabad collector narayana reddy review on mlc by elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8955378-679-8955378-1601184114152.jpg)
బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు, ఫొటో, పార్టీ పేరు ఉంటుందని.. గుర్తు ఉండదని తెలిపారు. ఓటరుకు అంకెలు మాత్రమే వేయాలని, పేర్లు రాయడం, టిక్కులు చేయడం చేయరాదన్నారు. ఈ విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని, మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అక్టోబర్ 12 తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్టులను పర్యవేక్షించడానికి నిజామాబాద్ సీపీ కార్యాలయం, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్, కలెక్టరేట్ ఎంసీసీలో సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. మోడల్ కోడ్‌ను ఎవరు ఉల్లంఘించినా... కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశాల్లో 100 మందిని మాత్రమే అనుమతించాలని తెలిపారు.