తెలంగాణ

telangana

ETV Bharat / city

భూమి ఉన్నంత వరకు కేసీఆర్​ సంక్షేమ ఫలాలు అందుతాయి: కవిత - సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్​ అర్బన్​ నియోజకవర్గంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని... మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న తెరాసకు ప్రజా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేలా సంసిద్ధం కావాలి: కవిత
ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేలా సంసిద్ధం కావాలి: కవిత

By

Published : Feb 15, 2021, 7:19 PM IST

ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టే విధంగా తెరాస కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్​ అర్బన్​ నియోజకవర్గంలో నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అనేక ఒడుదొడుకులు తట్టుకొని... తన లక్ష్యాన్ని ముద్దాడిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న తెరాసకు ప్రజా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు... పూర్తి అవగాహన కలిగి ఉండాలని కార్యకర్తలకు కవిత సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవిత్ర యజ్ఞంలా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. భూమి ఉన్నంత వరకు కేసీఆర్​ సంక్షేమ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, రాజేశ్వర్, నగర మేయర్ నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'నిరూపించలేకపోతే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకుంటా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details