తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్​లకు ఎమ్మెల్యే శంకుస్థాపన - నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా

ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్స్​ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు.

ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్ లకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్ లకు ఎమ్మెల్యే శంకుస్థాపన

By

Published : Sep 12, 2020, 9:46 PM IST


నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద, జీజీ కళాశాల గ్రౌండ్, అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి ఎమ్మెల్యే గణేష్ గుప్తా భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. గతంలో నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల, గంగస్థాన్ కాలనీల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రజలు నుంచి వస్తున్న స్పందనతో… నగరంలో మరిన్ని పార్కులు, ఇతర ప్రదేశాలలో త్వరలోనే ఓపెన్ జిమ్ నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు.

నగర ప్రజల ఉపయోగార్థం అర్సపల్లి, దుబ్బ చౌరస్తాలో పబ్లిక్ టాయిలెట్స్ ని ప్రారంభించారు. నగరం పరిశుభ్రంగా ఉండటం కోసం అన్ని ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ కార్పొరేటర్లు మాయవర్ సవిత, లావణ్య, ప్రవళిక, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details