తెలంగాణ

telangana

ETV Bharat / city

మొక్కలు నాటిన ఎమ్మెల్యే గంప గోవర్దన్, కలెక్టర్ శరత్ - mla gampa govardhan planted saplings at kamareddy

ఆరో విడత హరితహారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్ కుమార్ కలిసి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.

mla gampa govardhan and collector sarath kumar planted saplings at kamareddy
కామారెడ్డిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గంప, కలెక్టర్ శరత్

By

Published : Jul 15, 2020, 7:13 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో ఆరో విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్ కుమార్ కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అధికారులు, కార్మికులు అకుంటిత దీక్షతో ముందుకు కదులుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు అభినందించారు.

ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని... నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కాలనీల్లో చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేసే వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details