నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం ముఖద్వారం వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ లీకై నీరు వృథాగా పోయింది. పక్కనే ఉన్న విద్యుత్ ఉపకేంద్రంలోకిని భారీగా నీరు చేరింది. గ్రామానికి వెళ్లే రహదారి జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భగీరథ పైప్లైన్ లీకేజీ.. విద్యుత్ ఉపకేంద్రంలోకి చేరిన నీరు - Mission Bhagiratha pile leakage in nizamabad
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీకి గురై నీరంతా వృథాగా పోయింది. రహదారులు జలమయమవ్వడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

భగీరథ పైపులైన్ లీకేజీ
భగీరథ పైప్లైన్ లీకేజీ
అధికారుల నిర్లక్ష్యంతో తరచూ భగీరథ పైపులైన్ లీకేజీకి గురై వేల లీటర్ల నీరు వృధాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కొన్ని గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి పైప్లైన్కు మరమ్మతు చేయించాలని కోరారు.