లక్షల కోట్లు పెట్టి ఎలాంటి ప్రాజెక్టులైనా నిర్మించుకోవచ్చు కానీ.. అవి నిండాలంటే మాత్రం వర్షాలు కురవాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మొక్కలు పెంపకం ద్వారానే వర్షాలు పడతాయని మంత్రి గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి హరితహారాన్ని ప్రారంభించారు.
'నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే'
ఆరో విడత హరితహారంలో భాగంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మొక్కలు నాటారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజేశ్వర రావుతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
'నాటిన మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే'
ఓట్ల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం హరితహారాన్ని నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటిన చెట్ల సంరక్షణకు నిధులు సంమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం అదే గ్రామంలో వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?