తెలంగాణ

telangana

ETV Bharat / city

న్యాయసేవా సంస్థలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ నియామకం

Transgender in a law firm: రాష్ట్ర న్యాయసేవా సంస్థలో తొలిసారిగా ట్రాన్స్​జెండర్​కు ఉద్యోగ అవకాశం కల్పించారు. ట్రాన్స్​జెండర్​ అల్కాను ఒప్పంద పద్ధతిలో నిజామాబాద్ జిల్లా న్యాయసేవా సంస్థలో ఆఫీస్ సబార్డినేట్​గా నియమించారు. ఈ మేరకు సోమవారం అల్కాకు నియామక పత్రం అందజేశారు.

Transgender in a law firm
Transgender in a law firm

By

Published : May 3, 2022, 8:22 AM IST

Transgender in a law firm: తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌కు తెలంగాణలో న్యాయసేవా సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పించారు. నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవా సంస్థలో ట్రాన్స్‌జెండర్‌ అల్కను ఒప్పంద పద్ధతిలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమించారు. నిజామాబాద్‌లో గత నెల 13న న్యాయ, పోలీసు శాఖలు ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థలో ఒప్పంద పద్ధతిలో ముగ్గురు ఆఫీస్‌ సబార్డినేట్లను నియమించడానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ఆదేశాలతో ఇటీవల ముఖాముఖి నిర్వహించారు.

అందులో ఇంటర్‌ చదివిన అల్కను ఆఫీస్‌ సబార్డినేట్‌గా ఒప్పంద పద్ధతిలో పనిచేయడానికి ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా జడ్జి కుంచాల సునీత, అదనపు డీసీపీ డాక్టర్‌ వినీత్‌ సోమవారం అల్కాకు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి విక్రమ్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మయి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కళార్చన, మెజిస్ట్రేట్లు సౌందర్య, అజయ్‌కుమార్‌ జాదవ్‌, భవ్య, గిరిజ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details