నిజామాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైమదీబజార్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా అక్రమ కట్టడాలు గుర్తించి పోలీసు బందోబస్తు మధ్య అధికారులు చర్యలు తీసుకున్నారు. వసతులు కల్పించేందుకు కలెక్టర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నట్టు డిప్యూటీ సిటీ ప్లానర్ జలంధర్ రెడ్డి తెలిపారు.
నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు - అక్రమ కట్టడాల కూల్చివేత
పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సిటీ ప్లానర్ జలంధర్ రెడ్డి తెలిపారు.
నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు