తెలంగాణ

telangana

ETV Bharat / city

కేజీబీవీ సిబ్బంది సమస్యలపై ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం

కేజీబీవీ నాన్​ టీచింగ్​, వర్కర్స్​ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించినట్టు... ఐఎఫ్​టీయూ నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్​లో కవితను కలిసి వినతిపత్రం అందజేశారు.

iftu representatives memorandum to mlc kavitha on kgbv workers problems
కేజీబీవీ సిబ్బంది సమస్యలపై ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం

By

Published : Feb 2, 2021, 8:44 PM IST

కేజీబీవీ నాన్ టీచింగ్​, వర్కర్స్​ సమస్యలు పరిష్కరించాలంటూ... ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు. మొత్తం మహిళలతో నడుస్తున్న ఏకైక వ్యవస్థ కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది శ్రమ దోపిడికి గురవుతున్నారని... యూనియన్ జిల్లా ఇంఛార్జ్​ ఎం. సుధాకర్​ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 కేజీబీవీల్లో... అవసరాల మేరకు సిబ్బంది లేకపోవడం వల్ల నాన్​ టీచింగ్, వర్కర్స్​ అధిక పనిభారంతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

కేజీబీవీ సిబ్బంది సమస్యలపై ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం

జీతాల పెంపు, రైగ్యులరైజేషన్​, ఖాళీల భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయగా... ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు. అన్ని వివరాలతో వారం రోజుల్లో హైదరాబాద్​లో తనను కలవాలని, కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఈశ్వరి, సుమలత, హేమలత పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలి : హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details