దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. కొవిడ్ కారణంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సంఘటిత, అసంఘటిత కార్మిక రంగాన్ని ఆదుకోవాలని ఆ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.
మేడే పోస్టర్ను ఆవిష్కరించిన ఐఎఫ్టీయూ సభ్యులు - తెలంగాణ తాజా వార్తలు
కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి వెంకన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు.
135th may day poster released
కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మేడే ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్, యూనియన్ నాయకులు జి.చరణ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కల్పన, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని