తెలంగాణ

telangana

ETV Bharat / city

పసుపు పంటకు అంత ధర రావట్లేదు: ఐక్యకార్యాచరణ కమిటీ

పసుపు పంటకు మద్దతు ధర విషయంలో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పసుపు పంటకు ప్రస్తుతం రూ.6,800 మాత్రమే వస్తున్నాయని స్పష్టం చేశారు.

పసుపు పంట
TURMERIC CROP

By

Published : Feb 2, 2021, 5:13 PM IST

పసుపు పంటకు రూ.8 వేలకు పైగా ధర లభిస్తున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. పసుపు పంటకు ఈ సీజన్‌లో అత్యధికంగా రూ.6,800 రూపాయలు మాత్రమే వచ్చాయన్నారు. కొందరు కావాలనే రైతులను అయోమయం చేయాలనే ఉద్దేశంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

నిజామాబాద్‌లోని పసుపు మార్కెట్ల్‌లో ధరల పరిస్థితిని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు పరిశీలించారు. మార్కెట్‌లో డైరెక్ట్‌ పర్చేస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. పసుపు పంటకు బోర్డు వస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని రైతు కమిటీ నేతలు పేర్కొన్నారు.


ఇవీ చూడండి:బోయిన్​పల్లి మార్కెట్​లో వ్యర్థాల నిర్వహణ అద్భుతం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details