తెలంగాణ

telangana

By

Published : May 29, 2021, 6:59 PM IST

ETV Bharat / city

Vaccination : ప్రణాళిక ప్రకారం టీకాలు వేయాలి

సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం టీకాలు వేయాలని సూచించారు.

nizamabad district collector, nizamabad district collector narayana reddy, corona vaccination
నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్​లో కరోనా వ్యాక్సినేషన్

నిజామాబాద్ నగరంలోని స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. చంద్రశేఖర్ నగర్ కాలనీ, దుబ్బ యూపీహెచ్​సీ పరిధిలోని సూపర్ స్ప్రెడర్ల కోసం చేసిన వ్యాక్సిన్ ఏర్పాట్లపై ఆరా తీశారు.

వ్యాక్సినేషన్​లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం టీకాలు వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు పాలనాధికారి చంద్రశేఖర్, ఇతర అధికారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details