భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నిజమాబాద్ జడ్పీ కార్యాలయంలో ఛైర్మన్ విఠల్‌రావు.. కలాంకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, సీఈవో గోవింద్, డిప్యూటీ సీఈవో సంజీవ్‌కుమార్, డీఈవో దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జడ్పీ కార్యాలయంలో అబ్దుల్ కలాంకు నివాళులు - నిజమాబాద్ జిల్లా వార్తలు
నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు.. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జడ్పీ కార్యాలయంలో అబ్దుల్ కలాంకు నివాళులు
అబ్దుల్ కలాం 21వ శతాబ్దపు భారతదేశాన్ని కలలు కన్నారని.. అందుకు అనుగుణంగా ఆయన కృషి చేశారని జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఆదర్శవంతమైన కలాం జీవితం.. దేశ ప్రజలకు అనునిత్యం స్ఫూర్తినందిస్తూనే ఉంటుందని విఠల్ రావు తెలిపారు.
ఇదీ చదవండిః'అబ్దుల్ కలాం రెండోసారి రాష్ట్రపతి కాకపోవడం అన్యాయం'