ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: నిజామాబాద్ కలెక్టర్ - నిజామాబాద్ ఘటనపై కలెక్టర్ స్పందన
13:27 July 10
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: నిజామాబాద్ కలెక్టర్
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురి మృతిచెందిన ఘటనపై కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. కరోనాతో ముగ్గురు, అనారోగ్యంతో మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రోగుల ముందు ఆక్సిజన్ సిలిండర్లు మార్చడంతో అపోహలు తలెత్తాయని పాలనాధికారి వివరించారు. ఎవరూ ఇలాంటి అపోహలను నమ్మొద్దని సూచించారు.
ఇవీచూడండి:నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు రోగులు మృతి