Bridge collapsed in Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్‌పూర్‌లో వరద ఉద్ధృతికి ఓ వంతెన కూలిపోయింది. రెండు నెలల క్రితం సుమారు 30 లక్షల రూపాయలతో ఈ వంతెన నిర్మించారు. నాసిరకం పనులు చేయడంతోనే... రెండు నెలలకే వంతెన ఇలా కూలిపోయిందంటూ.. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇలాకలో పరిస్థితి ఇలా ఉందని స్థానికులు పేర్కొన్నారు.
ఎంపీ ఇలాకాలో కూలిన వంతెన.. స్తంభించిన రాకపోకలు..
Bridge collapsed in Kamareddy: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. పోటెత్తిన వరద ఉద్ధృతికి కామారెడ్డి జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. నిర్మించిన రెండు నెలలకే వంతెన ఇలా కూలిపోయిందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలిపోగా.. రాకపోకలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
Bridge collapsed
ఈ మార్గంలో మద్నూర్, జక్కల్ మండలాల వాసులు పోతాంగల్, కోటగిరి, బోధన్, నిజామాబాద్‌కు వెళ్తుంటారు. ఇప్పుడు వంతెన కూలిపోగా.. రాకపోకలు లేకపోవడంతో... తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Jul 15, 2022, 5:29 PM IST