కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ తప్పనిసరి: ఎంపీ అర్వింద్ - mp arvind about covid vaccination
45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ కోరారు. నిజామాబాద్‌లో గౌతమ్‌నగర్‌లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించారు.
కొవిడ్ వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలొద్దని ప్రజలకు భాజపా ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. నిజామాబాద్‌లోని గౌతమ్‌నగర్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో వసతులను ఎంపీ పరిశీలించారు. సిబ్బంది, అధికారులతో మాట్లాడి వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. టీకా తీసుకున్న వారితో అర్వింద్ మాట్లాడారు. వారికి పండ్లు అందించారు. కొవిడ్‌ను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని సూచించారు.