నిజామాబాద్లో ధన్వంతరి జయంతి వేడుకలు - ఆయుర్వేద ర్యాలీ
ధన్వంతరి జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ ర్యాలీ నిర్వహించారు. నేటి నుంచి నవంబర్ 2 వరకు జిల్లాలో ఆయుష్ దవాఖానాల పేరుతో ప్రజలకు ప్రత్యేక సేవలు అందిచనున్నట్లు తెలిపారు.
నిజామాబాద్లో ధన్వంతరి జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లాలో ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని 4వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహనరావు ప్రారంభించారు. ఆయుష్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 25 నుంచి నవంబర్ 2 వరకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతామన్నారు.