'మహేశ్ ఆర్మీలో చేరుతారని తెలిసి వివాహం చేసుకున్నా' - జవాన్ మహేశ్ తాజా వార్తలు
కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు దారులను అడ్డుకునే క్రమంలో అసువులు బాసిన వీర జవాన్ మహేశ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి మధ్య మహేశ్ లేరనే వార్త జీర్ణించుకోలేక పోతున్నారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉన్నా.. ఇలా జరగడం తట్టుకోలేక పోతున్నామని తెలిపారు. చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలన్న తపనతో ఉండేవారని కుటుంబసభ్యులు తెలిపారు. మహేశ్ ఆర్మీలో చేరుతారని తెలిసే వివాహం చేసుకున్నానని అతని భార్య సుహాసిని తెలిపారు. ఈ నెల 21న మహేశ్ పుట్టిన రోజు వేడుకకు ఏర్పాట్లు చేసినట్లు కుటుంబ సభ్యులు వివరించారు.
'మహేశ్ ఆర్మీలో చేరుతారని తెలిసి వివాహం చేసుకున్నా'
సంబంధిత కథనాలు:
- చిన్ననాటి నుంచే మహేశ్‌కు దేశ సేవపై ఆసక్తి... సేవలు చిరస్మరణీయం
- కశ్మీర్‌లో ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం
- తీరని వేదన.. ఏం జరిగిందో తెలియక మహేశ్ భార్య ఆందోళన