రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. అంగన్వాడీలో పనిచేసే కార్యకర్తలు, ఆయాలకు... ప్రభుత్వం ప్రకటించినట్లు ఎవరికీ అంత ఆదాయం లేనప్పటికీ... గత మూడు, నాలుగు నెలలుగా పెన్షన్లను తొలగించటం పట్ల నిజామాబాద్‌లోని కలెక్టర్ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆందోళన - నిజామాబాద్ తాజా వార్తలు
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. పెన్షన్ల రద్దును నిరసిస్తూ నిరసన చేపట్టారు.
![అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆందోళన anganwadi-activists-protest-in-front-of-the-nizamabad-collectorate-for-pending-pentions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7627166-538-7627166-1592225004033.jpg)
అంగన్ వాడి పెన్షన్లను వెంటనే ఇవ్వాలి : సీఐటీయూ
ప్రభుత్వానికి అన్ని రకాలుగా సేవలు చేస్తున్న ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూడటం సరైంది కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ.రమేష్ బాబు అన్నారు. పెన్షన్లను రద్దు చేస్తే... ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.