నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస ఎన్నికల శంఖారావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు హెలీకాప్టర్ ద్వారా నిజామాబాద్ చేరుకోనున్నారు. ఇందుకోసం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకుంటారు. సభకు సుమారు 2లక్షల మందిని తరలించేందుకు గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఇందూరులో కేసీఆర్ ప్రచార శంఖారావం - undefined
నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో సాయంత్రం తెరాస ఎన్నికల శంఖారావ సభ జరగనుంది. జనసమీకరణతో పాటు సభ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ కవిత మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సాయంత్రం 5 గంటలకు గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస సభ