కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు ఆర్డినెన్సు బిల్లులకు వ్యతిరేకంగా జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావుకు... అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా ఆ బిల్లుల రూపకల్పన చేశారని... ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా తెరాస ఎంపీలు ఓటు వేయడం, కేసీఆర్ ఆదేశించడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భూమయ్య, కృష్ణగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.
జడ్పీ ఛైర్మన్‌కు ఏఐకేఎంఎస్ నాయకుల వినతిపత్రం - జడ్పీ ఛైర్మన్‌కు ఏఐకేఎంఎస్ వినతిపత్రం
వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టే ఆర్డినెన్స్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని... ఏఐకేఎంస్ నాయకులు కోరారు. ఈ మేరకు జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావుకు వినతిపత్రం అందజేశారు.

జడ్పీ ఛైర్మన్‌కు ఏఐకేఎంఎస్ నాయకులు వినతిపత్రం