తెలంగాణ

telangana

ETV Bharat / city

పుట్టిన బిడ్డను తనకు తెలియకుండా అమ్మారంటూ మహిళ ఆందోళన - శిశుగృహకు బాలుడి తరలింపు

పిల్లలు పుట్టడం లేదని చెట్లు, పుట్టలకు మొక్కేవారిని మన దేశంలో చాలా మందిని చూస్తుంటాం.. అమ్మ, నాన్న.. అనే పిలుపు కోసం పరితపిస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారు కోకొల్లలు. అలా అమ్మతనాన్ని ఆస్వాదిద్దామనుకునేలోగా.. పురిట్లో బిడ్డను తనకు తెలియకుండా అమ్మేశారంటు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నవమాసాలు మోసి తను కన్నబిడ్డను తననుంచి ఎలా దూరం చేస్తారంటూ.. బిడ్డను కొనుగోలు చేసిన వారింటి ముందు ఆందోళనకు దిగింది.

child
బాలుడు

By

Published : Jun 3, 2022, 10:33 AM IST

పుట్టిన బిడ్డను తనకు తెలియకుండా అమ్మారంటూ మహిళ ఆందోళన

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్​నగర్​లో నాలుగు నెలల బాలుడిని విక్రయించిన ఘటన గురువారం కలకలం సృష్టించింది. పుట్టిన బిడ్డను తనకు తెలియకుండా మరొకరికి అమ్మారంటూ.. ఓ మహిళ కొనుగోలు చేసిన వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న ఐదో ఠాణా పోలీసులు శిశువును ఐసీపీఎస్ అధికారులకు అప్పగించగా వారు శిశుగృహాకి తరలించారు.

నిజామాబాద్‌ ఆనంద్‌నగర్‌కు చెందిన సునీత.. మక్లూర్‌ మండలం అలూర్‌కు చెందిన ఓ చిన్నారిని.. ఇద్దరు మధ్యవర్తుల సాయంతో కొనుగోలు చేసింది. కన్నతల్లి, వారి బంధువుల సమక్షంలో ఇద్దరి ఒప్పందంతోనే రూ.40 వేలు ఇచ్చి కొనుగోలు చేశామని.. కొనుగోలు చేసిన మహిళ చెబుతోంది.

తాజాగా కన్నతల్లి మాత్రం తనకు తెలియకుండా అమ్మారంటూ.. వెంటనే చిన్నారిని ఇవ్వాలంటూ ఆనంద్​నగర్​లో నిరసన తెలిపింది. ఈ విషయం ఐదో ఠాణా పోలీసులకు తెలియడంతో వివరాలు సేకరించారు. ఐసీపీఎస్ అధికారులను రప్పించి శిశువును అప్పగించారు. విచారణ పూర్తయ్యే వరకు తమ వద్ద బిడ్డ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details