బాన్సువాడ మండలంలోని తాడ్కోలుకు చెందిన బాలకృష్ణ 2019 జనవరిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీట్ 1 పోస్టుమన్‌గా చేరాడు. అప్పటి నుంచి ఉత్తరాలు కానీ ఇతర పత్రాలను కానీ బట్వాడా చేయకుండా పట్టణంలోని తన బంధువుల హోటల్‌లో దాచిపెట్టాడు. ఉత్తరాలు బట్వాడా కావడం లేదంటూ అధికారులకు సమాచారం అందడంతో శనివారం వారు తనిఖీ చేయగా 12 సంచుల్లో 7,000 వరకు ఉత్తరాలు దొరికాయి.
రెండేళ్లుగా బట్వాడా చేయని పోస్టుమన్..
నెల కాదు.. రెండునెలలు కాదు.. ఏకంగా రెండేళ్ల నుంచి ఉత్తరాలు బట్వాడా చేయకుండా తన వద్దే దాచుకున్న ఓ పోస్టుమన్ ఉదంతమిది. చివరకు ఉన్నతాధికారులకు తెలియడంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
రెండేళ్లుగా బట్వాడా చేయని పోస్టుమన్..
వాటిలో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వివిధ పుస్తకాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు ఉన్నాయి. బాలకృష్ణను విచారించగా తనే దాచినట్లు అంగీకరించడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
ఇవీ చూడండి:'ఫొటోలతో సహా యాదాద్రి పనుల నివేదిక కావాలి'