కామారెడ్డి జిల్లా భిక్కనూర్ తాలూకా జంగంపల్లిలో రెండు నెలల బాలుడి అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. మూడు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన సంచార జాతుల కుటుంబానికి చెందిన బాలుడిని దుండగులు అపహరించారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సంగారెడ్డిలో నిందితులను గుర్తించారు.
కిడ్నాప్‌కు గురైన బాలుడు గుర్తింపు.. నలుగురు అరెస్టు - kamareddy dist news
కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో బాలుడు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. మూడ్రోజుల క్రితం జంగంపల్లిలో రెండు నెలల బాబును నలుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి అపహరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.
కిడ్నాప్‌కు గురైన బాలుడు గుర్తింపు.. నలుగురు అరెస్టు
నేరస్థులతో కలిసి సంగారెడ్డిలో వడ్డెర పద్మ ఇంట్లో బాబును దాచినట్లు పోలీసులు గుర్తించారు. బాబును ఎత్తుకెళ్లిన వడ్డెర పద్మ, ఉందడి నవీన్, మామిడాల వెంకటేష్, కూడలి రవళి లను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండుకు తరలించారు. కేసు వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ శ్వేతారెడ్డి వెల్లడించారు. నలుగురు వ్యక్తులు కలిసి పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకోవడానికి మొదటిసారి ప్రయత్నించారని ఎస్పీ తెలిపారు. అపహరణకు గురైన బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.