దేశంలో ఎక్కడో ఓ చోట.. ఎంతో మంది అన్నం కోసం అలమటిస్తుండగా.. కొందరి నిర్లక్ష్యం వల్ల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం సరఫరా చేసిన 16 క్వింటాళ్ల బియ్యం పాడయ్యాయి. ఎనిమిది నెలల నుంచి వృథాగా వదిలేయగా పూర్తిగా పురుగులు పట్టాయి. ఎలుకలు తినేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఎలుకలు తినేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. - బోధన్ వార్తలు
మధ్యాహ్న భోజనం కోసం వినియోగించే బియ్యం ఎలుకలకు ఆహారమైంది. ఎనిమిది నెలలుగా నిల్వ ఉంచడంతో విద్యార్థుల కడుపు నింపాల్సిన బియ్యం.. పురుగులు పట్టి కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకపోవడం వల్లే ధాన్యం వృథా అయిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
ఎలుకలు తినేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
లాక్‌డౌన్‌కు ముందు మార్చి నెలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం బియ్యాన్ని సరఫరా చేశారు. పాఠశాలలు తెరుచుకోక పోవడంతో పురుగులకు ఆహారంగా మారింది. బియ్యం పూర్తిగా పాడైన తర్వాత గమనించిన ప్రధానోపాధ్యాయుడు.. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:కురుస్తున్న మంచు.. వణుకుతున్న ప్రజలు