చాలా కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ వంటిదని అభివర్ణించారు. గిరిజనులకు పోడు భూముల సమస్యలు పరిష్కారం కావాలన్నారు. జూన్ తర్వాత దేశమే ఆశ్చర్యపోయే కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తామన్నారు. ఒక్కొక్క గుంట లెక్కతేలేలా పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. భూ సమస్యలు పరిష్కరించడానికి తానే స్వయంగా ప్రతి జిల్లాకు వస్తానన్నారు. జిల్లాలో రెండు రోజులు ఉండి స్యయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. భూసమస్యల విషయంలో రైతులు ఎవరికీ లంచం ఇవ్వద్దని సూచించారు.
దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం తెస్తాం
ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశమే ఆశ్చర్యపోయేలా జూన్ తర్వాత చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. భూసమస్యల విషయంలో రైతులు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం తెస్తాం: సీఎం