తెలంగాణ

telangana

ETV Bharat / city

YS SHARMILA: కుర్ముడ్​గేట్ వద్ద షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష - sharmila praja prasthanam updates

అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కారు విఫలమైందని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల (ysrtp president ys sharmila ) ఆరోపించారు. తెరాస పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. ఆసరా పింఛన్లను భార్య, భర్త ఇద్దరికీ ఇవ్వకపోతే... ముఖ్యమంత్రిని నిలదీయాలని మహిళలకు సూచించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా... నల్గొండ జిల్లాలో రెండోరోజు కొనసాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కుర్ముడ్​గేట్ వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

YS SHARMILA
YS SHARMILA

By

Published : Nov 2, 2021, 5:10 AM IST

ప్రజాప్రస్థానం పాదయాత్రలో (praja prasthanam)భాగంగా పదమూడో రోజు (సోమవారం) వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు (ysrtp president ys sharmila)షర్మిల... నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో పర్యటించారు. పోలేపల్లి రాంనగర్​ వద్ద యాత్ర ప్రారంభించి... ఎర్రమట్టితండా, బోటిమీదితండా, చాకలిశేరిపల్లి, గొల్లపల్లి, సమాఖ్యనగర్​తోపాటు పలు గ్రామాల్లో ప్రజల్ని కలుసుకున్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నా... కేసీఆర్ పట్టించుకోకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని... నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. వర్షం పడుతున్నా షర్మిల... తన పాదయాత్రను కొనసాగించారు. ఏడేళ్ల తెరాస పాలనలో ఎనిమిది వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

సర్కారీ కొలువులకు నోటిఫికేషన్లు రాలేదంటూ ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాలకు చెందిన మహేష్ సూసైడ్ నోట్​ను మరణ వాంగ్మూలంగా పరిగణించాలని షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్​పై కేసు పెట్టి అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిటాన్​పల్లిలో ఉదయం 9:30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుర్ముడ్​గేట్ వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడతారు.

ఇదీచూడండి:Huzurabad By Election Counting: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు కౌంట్​డౌన్

ABOUT THE AUTHOR

...view details