తెలంగాణ

telangana

ETV Bharat / city

మూగజీవాల ఆకలి తీర్చారు! - Young People Giving Food To Monkeys Due To Lock Down Period

యాదాద్రి పుణ్యక్షేత్రంలో జనసంచారం లేక కోతులకు ఆహారం దొరకడం లేదు. ఆకలితో అలమటిస్తున్న కోతులకు కొంతమంది యువకులు పండ్లు, కూరగాయలు ఇచ్చి ఆకలి తీర్చారు.

Young People Giving Food To Monkeys Due To Lock Down Period
మూగజీవాల ఆకలి తీర్చారు!

By

Published : Apr 3, 2020, 8:52 PM IST

మూగజీవాల ఆకలి తీర్చారు!

కరోనా వ్యాప్తి నివారణకు తలపెట్టిన లాక్​డౌన్ కారణంగా దుకాణాలన్నీ మూసే ఉంటున్నాయి. యాదాద్రిలో భక్తుల సంచారం కూడా లేదు. ఓ వైపు తినడానికి తిండి లేక.. ఏదో ఒకటి ఇచ్చి ఆకలి తీర్చేవారు. తినడానికి ఏమీ దొరకక.. భక్తులు పెట్టే తిండి లేక కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి బాధ గమనించిన కొంతమంది యువకులు యాదగిరి పట్టణంలోని కూరగాయలు, పండ్ల దుకాణాల్లో మిగిలినవి తీసుకొచ్చి కోతుల ఆకలి తీరుస్తున్నారు. గత వారం రోజులుగా.. ప్రతిరోజు కూరగాయలు, మిగిలిపోయిన పండ్లు సేకరించి కోతుల ఆకలి తీరుస్తూ.. మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details