ఇంటి ముందున్న చెట్టునే ఐసోలేషన్ గదిలా మార్చుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకునికి ఇటీవల కరోనా సోకింది. ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉండగా... ఒకే గది ఉండడంతో శివకు హోమ్ ఐసోలేషన్ కు ఇబ్బందిగా మారింది.
ఐసోలేషన్ కోసం చెట్టునే ఆవాసంగా మార్చుకున్న బీటెక్ విద్యార్థి - నల్గొండ జిల్లాలో చెట్టుపై ఐసోలేషన్ వార్త
ఆ యువకునికి కరోనా సోకింది. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. కాని ఒకే గది ఉంది. ఐసోలేషన్ కోసం అతడికి ఏం చేయాలో తోచలేదు.. చివరికి ఇంటి ముందున్న చెట్టునే ఐసోలేషన్ గదిలా మార్చుకున్నాడు.
ఇంట్లోవారికి వ్యాధి వ్యాపిస్తుందనే భయంతో.. చివరికి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుపై మంచె కట్టుకొని ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం, నీళ్లు తాడు సహాయంతో కుటుంబ సభ్యులు అందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ పంచాయతీల్లో, మండల కేంద్రంలో ఎటువంటి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో వ్యాధి సోకినవారు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఇకనైనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా బాధితులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి:29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!