Yadadri temple news: శిల్పశాస్త్రంలో కృష్ణశిలకు ఉత్తమ పురుష శిలగా ఓ ప్రాధాన్యముంది. విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని ఆ శిలలతోనే పునర్నిర్మించారు. విగ్రహాలు చెక్కడానికి అత్యంత విశేషమైనదిగా కృష్ణశిల(బ్లాక్ గ్రానైట్)ను వ్యవహరిస్తారని యాదాద్రి ఆలయ నిర్మాణ ప్రధాన స్థపతి వేలు ఆనందచారి తెలిపారు. భాస్వరం వంటి ఖనిజాల సమ్మేళనంగా ఈ శిల రూపుదిద్దుకుంటుందని.. ఆ శిలతో చెక్కిన విగ్రహాన్ని అభిషేకించిన జలంలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయని అన్నారు. ఈ రాతిని శిల్పంగా మలిచేటప్పుడు అగ్ని పుడుతుందని ఆయన వివరించారు.
Yadadri temple news: యాదాద్రి ప్రధానాలయాన్ని నిర్మించిన కృష్ణశిల.. ఓ రంగుల కళ! - కృష్ణశిల తాజా వార్తలు
Yadadri temple news: శిల్పశాస్త్రంలో కృష్ణశిలకు ఉత్తమ పురుష శిలగా ఓ ప్రాధాన్యముంది. మహాదివ్య క్షేత్రంగా పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని ఆ శిలలతోనే పునర్నిర్మించిన విషయం తెలిసిందే. మార్చి 28న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతటి విశేషమైన కృష్ణ శిల గురించి ఓ సారి చూద్దాం.
Yadadri temple news
గుంటూరు జిల్లా కమ్మవానిపాలెం, ప్రకాశం జిల్లా గురిజేపల్లి మధ్య ఉన్న ఉత్తమమైన కృష్ణశిలలను భారీగా సంగ్రహించి.. యాదాద్రి ఆలయానికి వినియోగించినట్లు వేలు పేర్కొన్నారు. ఈ శిలలు పగటి ఎండలో శ్వేతవర్ణంలో కనిపిస్తాయని.. సూర్యాస్తమయ సమయంలో ఎరుపు రంగు పులుముకొంటాయని అన్నారు. వాన నీరు జాలువారినప్పుడు సహజ వర్ణమైన నల్లటి రంగులోకి మారుతాయని ఆలయ ప్రధాన స్థపతి వేలు ఆనందచారి వివరించారు.
ఇదీ చదవండి:YADADRI NEW LIGHTING: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. యాదాద్రి జిగేల్ మనేలా