తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 12:09 PM IST

ETV Bharat / city

ఆస్తుల వివరాల సేకరణ పారదర్శకంగా జరగాలి: అదనపు కలెక్టర్​

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తుల వివరాల సేకరణ పారదర్శకంగా సాగాలని అధికారులు, సిబ్బందిని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. ఆస్తుల వివరాలను ధరణి పోర్టర్​లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.

assets details collect survey
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తుల వివరాల సేకరణ

యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీల్లో ఆస్తుల వివరాల సేకరణ కోసం జరుగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్​ పరిశీలించారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సేకరించి ధరణి సైట్​లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు, ఇంటి యజమాని ఫోటో, గుర్తింపు కార్డు, ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, పాస్​బుక్ నెంబర్ తదితర వివరాలను సేకరిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తుల వివరాల సేకరణ

ఉదయం 6 గంటల నుంచే సర్వేను ప్రారంభించాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని అదనపు కలెక్టర్​ సూచించారు. సర్వే పారదర్శకంగా సాగాలని, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

ఇవీ చూడండి:అధికారులు కావలెను: ఇన్​ఛార్జీల పెత్తనం.. పరిపాలనపై ప్రభావం

ABOUT THE AUTHOR

...view details