తెలంగాణ

telangana

ETV Bharat / city

రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు.. సీఎం హామీతో కొత్త ఆశలు - రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు

ఆహారభద్రత కార్డు దరఖాస్తుదారుల నిరీక్షణకు తెరపడబోతోంది. ఈ నెల 10న హాలియా బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు... త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయన్న ఆశ కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా 35 వేలకు పైగా కొత్త కార్డులు పెండింగ్​లో ఉండగా... మరో 42 వేల మందికి పైగా పేర్ల నమోదుకు ఎదురుచూస్తున్నారు.

waiting for ration cards in combine nalgonda district
రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు.. సీఎం హామీతో కొత్త ఆశలు

By

Published : Feb 15, 2021, 5:43 PM IST

పేదలకు ఆహారభద్రత కార్డులు జారీ చేస్తామన్న ముఖ్యమంత్రి మాటతో... దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా... ఇప్పటికే 78 వేల మందికి పైగా కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో గత డిసెంబరు నాటికి 35,356 మంది... పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఆర్ఐ స్థాయిలో 16,255, తహసీల్దార్ స్థాయిలో 3,094, డీఎస్​వో వద్ద 16,007 విచారణలో ఉన్నాయి.

నూతన యూనిట్ల చేర్పు, కార్డుల బదలాయింపు తదితర మ్యుటేషన్ల కోసం 42,911 దరఖాస్తులు రాగా... అవన్నీ పెండింగ్​లో పడిపోయాయి. యూనిట్లు పెంచకపోవడంతో... కుటుంబాల్లో పెరిగిన సభ్యులు లబ్ధి పొందడం లేదు. కార్డులు ఎప్పుడు జారీ చేస్తారంటూ... తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

కార్డుంటేనే సర్కారు సాయం..

నల్గొండ జిల్లాలో 15,415, సూర్యాపేటలో 11,801, యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,140 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 16, 907, సూర్యాపేట జిల్లాలో 13,423, యాదాద్రి జిల్లాలో 12,581 మంది పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్ సమయంలో విధించిన లాక్​డౌన్​ వల్ల... కార్డు లేని వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోని సరకులు... రాయితీపై పొందలేకపోయారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఇతరత్రా సర్కారు సాయం పొందాలంటే... ఆహారభద్రత కార్డులు తప్పనిసరి. అవి లేకపోవడంతో... దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు అవస్థలు పడుతూనే ఉన్నారు.

ఇదీ చూడండి:భూములు తీసుకున్నారు సరే.. పరిహారం మాటేంటి మరి..?

ABOUT THE AUTHOR

...view details