నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి... స్వతంత్ర అభ్యర్థి వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. రిక్షా తొక్కుకుంటూ... రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామపత్రాలు అందజేశారు.
వినూత్న రీతిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్... - రిక్షాపై వచ్చి నామినేషన్
నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్న పద్ధతిలో ఆర్వో కార్యాలయానికి చేరుకున్నాడు. ప్రభుత్వంపై నిరసనతోనే నామినేషన్ వేస్తున్నట్లు సదరు అభ్యర్థి తెలిపారు.
variety nomination filed by independent candidate in nalgonda
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పూస శ్రీను... ప్రభుత్వ తీరుపై నిరసనతోనే నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు అటకెక్కాయంటూ... వినూత్న రీతిలో నల్గొండ కలెక్టరేట్‌కు చేరుకున్నారు.