నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కన నిర్జీవ స్థితిలో పడి ఉండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి జేబులో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని కట్టంగూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తిచారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని.. గత 15 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.
నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ అనుమానాస్పద మృతి - tsrtc driver died at narkatpally
నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
07:32 October 26
నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
Last Updated : Oct 26, 2019, 10:20 AM IST