నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎర్రగట్టు తండాలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో కేతావత్ రాములు ఇల్లు దగ్ధమయింది. పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకుని బతికే తమకు ఇప్పుడు గూడు కూడా లేకుండా పోయిందని రాములు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు సాయం చేయాలని కోరారు.
విద్యుత్‌షాక్‌తో ఇల్లు దగ్ధం.. తెరాస నేత ఆర్థిక సాయం - trs leader helped a poor old couple
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎర్రగట్టు తండాలో షార్టసర్క్యూట్తో పేద వృద్ధ జంట ఇల్లు పూర్తిగా దగ్ధమయింది. వారి దీనావస్థను తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు.
పేద వృద్ధ జంటకు స్థానిక తెరాస నేత ఆర్థిక సాయం
విషయం తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు, మలిదశ ఉద్యమ నాయకుడు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి.. రాములు దంపతులకు ఆర్థిక సాయం చేశారు. వృద్ధ దంపతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మార్వోతో మాట్లాడిన ఆయన..ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందిస్తామని భరోసా కల్పించారు. రవీందర్‌రెడ్డితోపాటు స్థానిక నేతలు నయీమ్, రామకృష్ణ ఉన్నారు.