నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తెరాస అభ్యర్థి నోముల భగత్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్లో పాల్గొన్నారు. అంతకుముందు తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్ర పటానికి భగత్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
సాగర్ ఉపఎన్నికలో ఓటు వేసిన తెరాస అభ్యర్థి నోముల భగత్ - nagarjuna sagar by election polling 2021
నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొవిడ్ నిబంధనల మధ్య జరుగుతున్న పోలింగ్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
![సాగర్ ఉపఎన్నికలో ఓటు వేసిన తెరాస అభ్యర్థి నోముల భగత్ nomula bhagat, bhagat casted his vote, nagarjuna sagar by election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11433657-1103-11433657-1618633271365.jpg)
నాగార్జునసాగర్ ఉపఎన్నిక, నోముల భగత్, ఓటేసిన భగత్
అనంతరం అనుముల మండలం ఇబ్రహీంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయని, కరోనా నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారని తెరాస అభ్యర్థి నోముల భగత్ తెలిపారు.